Advertisement
Google Ads BL

సిద్దు జొన్నలగడ్డ నిజంగా గ్రేట్


స్టార్ హీరోలు, పాన్ ఇండియా హీరోస్ కూడా సినిమాలు డిజాస్టర్ అయితే నిర్మాతలకు, డిట్రిబ్యూటర్స్ కి మొహం చాటేసే రోజుల్లో కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ కి అండగా నిలవడం చూసిన వారు సిద్దు జొన్నలగడ్డ ను అప్రిషేట్ చెయ్యకుండా ఉండలేకపోతున్నారు. 

Advertisement
CJ Advs

టిల్లు సీరీస్ తో యూత్ ఆడియన్స్ లో బలమైన ముద్ర వేసిన సిద్దు జొన్నలగడ్డ ఆతర్వాత చేసిన స్పై థ్రిల్లర్ జాక్ చిత్రం అభిమానులను డిజప్పాయింట్ చెయ్యడమే కాదు, అటు డిస్ట్రిబ్యూటర్స్ ని, ఇటు నిర్మాతలను ముంచేసింది. జాక్ సినిమా ఆశించిన ఫలితాలను రాబట్టకపోవడంతో, నిర్మాతలకు జరిగిన నష్టంలో తన వంతు బాధ్యతగా సిద్దు మంచి నిర్ణయం తీసుకున్నాడు.

తన పారితోషికం నుండి సగం, అంటే 4 కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగి ఇచ్చి, తన పెద్ద మనసును చాటుకున్నాడు. సిద్దు లాంటి నటులు నిర్మాతలకు అండగా నిలిస్తే, సినీ పరిశ్రమ మరింత విజయవంతమవుతుంది అంటూ నిపుణులు అభిప్రాయం పడడమే కాదు.. చాలామంది సిద్దు నిర్ణయాన్ని అభినందిస్తూ అందరు హీరోలు సిద్దు ని ఫాలో అయితే మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Siddhu Jonnalagadda is really great:

Siddhu Jonnalagadda Returns Rs 4 Cr After Disaster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs