కమల్ హాసన్ కన్నడ భాష విషయంలో చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపడమే కాదు.. కమల్ హాసన్ గనక క్షమాపణ చెప్పకపోతే ఆయన నటించిన థగ్ లైఫ్ చిత్రాన్ని కన్నడలో ఆడనివ్వబోమంటూ శపధం చేసారు కన్నడీగులు. కమల్ ఊరుకోరుగా.. నేనేం తప్పు చెయ్యలేదు, తప్పుగా మాట్లాడలేదు, నేనేందుకు క్షమాపణ చెప్పాలి అంటారు. కన్నడలో థగ్ లైఫ్ చిత్రాన్నిబ్యాన్ చెయ్యడంతో కమల్ కోర్టుకెక్కారు.
కర్ణాటక హై కోర్టులో కమల్ తన థగ్ లైఫ్ చిత్రాన్ని ఎటువంటి అడ్డంకి లేకుండా కన్నడలో విడుదల చేసుకోనివ్వాలని పిటిషన్ వేశారు. కానీ కర్ణాటక హై కోర్టు మాత్రం మాత్రం కమల్ హాసన్ కె చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అని కమల్ మట్లాడడంతో కన్నడ వాసుల ఆగ్రహానికి గురయ్యారు.
అదేదో క్షమాపణ చెబితే పోయేదానికి అని కమల్ కి కర్ణాటక హై కోర్టు సూచించగా.. కమల్ మాత్రం తానేమి తప్పుగా మాట్లాడలేదు అంటూ ఇంకా తన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. నేను మాట్లాడింది తప్పుగా అర్ధం చేసుకున్నారు, నేనేమి తప్పు మాట్లాడలేదు, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలని అంటూ కమల్ వితండవాదం చెయ్యడంతో ఇప్పుడు ఈ సమస్య ముదిరి పాకానపడింది.