Advertisement
Google Ads BL

మ‌మ్మ‌ల్ని అంటుంటే బాధ‌గా ఉంది: స్టార్ హీరో


బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడున్న‌ర‌ ద‌శాబ్ధాల కెరీర్ లో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారు. ఖాన్ ల త్ర‌యంలో ఆయ‌న ఒకరు. ఇటీవల తనను షారుఖ్ ఖాన్  - సల్మాన్ ఖాన్ లతో పాటు పరిశ్రమలోని టాప్ 3 ఖాన్ లలో ఒకరిగా ఉండటంపై తనకు ఎలాంటి భావన ఉందని ప్ర‌శ్నించ‌గా, దానికి ఆయ‌న స్పందించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Advertisement
CJ Advs

 

రాజ్ షమానీతో చాటింగ్ సెష‌న్‌లో అమీర్ వ్యాఖ్యానిస్తూ.. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి స్టార్లు ద‌శాబ్ధాలుగా చాలా కృషి చేస్తున్నారు. దాదాపు మాలాగే, వారు కూడా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ధీటైన‌ సహకారాన్ని  అందిస్తున్నారని, అందువల్ల వారు కూడా సమానమైన గుర్తింపు పొందాలని అభిప్రాయ‌ప‌డ్డారు. ఖాన్ అనే ట్యాగ్ తో తనకు ఎటువంటి సమస్య లేకపోయినా, ప్రజలు తనతో పాటు షారుఖ్ , సల్మాన్ పేర్లను మాత్రమే ప్రస్తావించి ఇత‌ర పేర్ల‌ను ప‌ట్టించుకోనప్పుడు అది తనను బాధపెడుతుందని, ఎందుకంటే అజయ్, హృతిక్, అక్షయ్ వంటి ఇతర నటులను త‌గ్గించి చూసిన‌ట్టుగా అనిపిస్తుందని అమీర్ అన్నారు. అది చెడుగా అనిపిస్తుంద‌నీ అన్నారు.

 

మా పేర్లు చెబితే త‌ప్పు కాదు కానీ, అనుభ‌వ‌జ్ఞులైన ఇత‌ర స్టార్ల‌కు గౌర‌వం గుర్తింపు ఇవ్వాల‌ని అమీర్ అన్నారు. మేం మూడున్న‌ర ద‌శాబ్ధాలుగా సినీరంగంలో ఎన్నో విజ‌యాల్ని అందించాం. కేవ‌లం మేము మాత్ర‌మే కాదు.. ఇత‌రులు కూడా ఇచ్చారు! అని అమీర్ ఖాన్ అన్నారు. ఖాన్‌ల‌ను మాత్ర‌మే టాప్ 3 ఖాన్‌లుగా ఎందుకు పరిగణిస్తారని అమీర్‌ను ప్ర‌శ్నించ‌గా, వారి సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం వల్ల కావచ్చు అని బదులిచ్చారు. అమీర్ ఖాన్ న‌టించిన `సితారే జ‌మీన్ పార్` థియేట్రిక‌ల్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

Aamir Khan feels sad about them:

&nbsp; <p class="MsoNormal">Aamir Khan feels bad for Ajay Devgn and Akshay Kumar &nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs