అఖండ తాండవం అయితే డిసెంబర్ లేదంటే సంక్రాంతికి విడుదలకు రెడీ చేసే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నారు, బాలయ్య బర్త్ డే కి అఖండ 2 ని డిసెంబర్ లో అయినా, లేదంటే 2025 సంక్రాంతికి అయినా విడుదల చేస్తారనే న్యూస్ రాబోతుంది అనగానే నందమూరి అభిమానులు చాలా డిజప్పాయయింట్ అయ్యారు. దర్శకుడు బోయపాటి అఖండ 2 ని దసరా టార్గెట్ గా తెరకెక్కిస్తున్నట్టుగా ఆరంభంలోనే చెప్పారు.
కానీ మధ్యలో అది డిసెంబర్ కి మారొచ్చనే ఊహాగానాలు నడిచే సరికి వారు చాలా నిరాశ పడ్డారు. తాజా సమాచారం ప్రకారం అఖండ 2 ని ముందు అనుకున్న ప్రకారమే దసరా అంటే సెప్టెంబర్ 25 కి రిలీజ్ చెయ్యాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అవుతున్నారట. అందుకు అనుగుణంగానే జూన్ 10 న బాలకృష్ణ బర్త్ డే టీజర్ కి రిలీజ్ డేట్ ని యాడ్ చేస్తున్నారని టాక్.
అదే సెప్టెంబర్ 25 న పవన్ కళ్యాణ్ OG అంటూ మేకర్స్ రిలీజ్ తేదీని అనౌన్స్ చేసారు. మరి అఖండ 2 ని OG మీదకి వదులుతారా, పవన్ పై బాలయ్య కయ్యానికి సై అంటారా, పవన్-బాలయ్య ఆప్తులు, ఒకరితో ఒకరు పోటీపడతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదైనా జూన్ 10 న అఖండ తాండవంపై అసలైన క్లారిటీ అయితే వస్తుంది.