Advertisement
Google Ads BL

అలీ కి మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్


కమెడియన్ అలీ టాలీవుడ్ స్టార్ హీరోలందరితో యాక్ట్ చెయ్యడమే కాదు, అందరితో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి. అయితే అలీ వైసీపీ లోకి వెళ్ళాక పవన్ కళ్యాణ్ తో ఉన్న స్నేహం పక్కన పెట్టడం, అలీ కి అవకాశాలు తగ్గడం లాంటివి జరిగాయి. ఇక వైసీపీ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పుడే అలీ సైలెంట్ గా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. 

Advertisement
CJ Advs

మెగాస్టర్ చిరు తో మంచి ర్యాపొ మైంటైన్ చేసే అలికి తాజాగా మెగాస్టార్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా చిరు తన తోటలో పండిన మామిడి పండ్లను ప్యాక్ చేసి అలీ కి పంపారు. మామిడి పండ్లు మాత్రమే కాదు ఈసారి ప్రత్యేకంగా చిరంజీవి భార్య సురేఖ నడుపుతున్న అత్తమ్మాస్ కిచెన్ నుంచి స్పెషల్ గా ప్యాక్ చేసిన బహుమతిని అలీ కి పంపించారు. 

అత్తమ్మాస్ కిచెన్ ప్యాక్ లో రసం పౌడర్, రెడీ మెడ్ స్వీట్, పొంగల్, ఉప్మా మిక్స్ లతో పాటుగా చిన్నపాటి జాడి ని కూడా పంపించినట్టుగా అలీ వైఫ్ జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసారు. తమపై ఉన్న ప్రేమతో తమకు చిరు నుంచి ఈ కానుక అందింది అంటూ ఆమె తెలిపారు. అది చూసే అలీ కి మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్ అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Megastar special gift to Ali:

Megastar Chiranjeevi gives special gift to comedian Ali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs