Advertisement
Google Ads BL

స్పిరిట్ నుంచి అందుకే తప్పుకున్నా-దీపిక


ఈమధ్యన సందీప్ వంగ స్పిరిట్ కోసం దీపికను తీసుకోవడం, తర్వాత ఆమెను రిజెక్ట్ చెయ్యడంతో మొదలైన వివాదం.. సందీప్ వంగ vs దీపికా పదుకొనే దాకా వెళ్ళింది. దీపికా పదుకొనె స్పిరిట్ నుంచి తప్పుకున్నాక ఆమె స్పిరిట్ స్టోరీని తన పీఆర్ టీమ్ చేత బయటపెట్టింది అంటూ సందీప్ వంగ సంచలన ట్వీట్ చేసారు. 

Advertisement
CJ Advs

డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ దీపిక పై సందీప్ రెడ్డి వంగ ఇండైరెక్ట్ గా రెచ్చిపోయి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు, ప్రస్తుతం దీపిక పదుకునె, సందీప్ వంగ నడుమ కోల్డ్ వార్ హాట్ హాట్ గా నలుగుతున్న సమయంలోనే దీపికా అసలు స్పిరిట్ నుంచి తానెందుకు తప్పకుందో సందీప్ పేరు కానీ, స్పిరిట్ పేరు కానీ రివీల్ చెయ్యకుండా వివరణ ఇచ్చే ప్రయత్నమైతే చేసింది. 

ఈ మధ్యన ఓ డైరెక్టర్ న‌న్ను క‌లిసి స్టోరీ చెప్పారు. స్టోరీ చాలా బాగా న‌చ్చింది. కానీ పారితోషికం దగ్గరకు వచ్చేసరికి ఇంత చార్జ్ చేస్తా అని నేను చెప్పాను. దానికి వారు ఒప్పుకోలేదు. అందుకే నేను వారి సినిమా చెయ్యను అని నో చెప్పాను. నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు. అందుకే ఆ సినిమాకి నేను ఒప్పుకోలేదు.. అంటూ దీపికా పారితోషికం కోసమే తను స్పిరిట్ నుంచి బయటికొచ్చినట్టుగా చెప్పకనే చెప్పేసింది. 

Deepika Padukone - Spirit Movie Controversy:

Deepika Padukone reportedly quit Spirit over a host of reasons
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs