Advertisement
Google Ads BL

శోభిత బర్త్ డే-చైతు స్పెషల్ పోస్ట్


ఒకప్పుడు తెలుగులో అప్పుడప్పుడు కనిపించిన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్ లో కనిపిస్తుంది. కారణం హీరో నాగ చైతన్య ను శోభిత ప్రేమ వివాహం చేసుకుంది. అక్కినేని ఇంటికి అడుగుపెట్టిన శోభిత దూళిపాళ్ల కోడలి గా, భార్యగా బాధ్యతలు తీసుకుని నటనను కోనసాగిస్తుంది. 

Advertisement
CJ Advs

ఇప్పుడు చైతు-శోభితల జంట విదేశాల్లో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వారు వెకేషన్ ట్రిప్ లో ఉండగానే.. శోభిత దూళిపాళ బర్త్‌డే వచ్చింది. భార్య బర్త్‌డే ను నాగ చైతన్య విదేశాల్లోనే గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత నాగ చైతన్య, శోభిత మొదటి సారి బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. పెళ్లి తర్వాత శోభిత మొదటి బర్త్‌డే కావడంతో నాగ చైతన్య చాలా స్పెషల్‌గా ప్లాన్‌ చేసాడని టాక్. 

అంతేకాదు భార్య బర్త్ డే కి నాగ చైతన్య సోషల్ మీడియాలో స్పెషల్‌ పోస్ట్‌ పెట్టాడు. నాగ చైతన్య - శోభితతో కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. హ్యాపీ బర్త్ డే మై లేడీ అంటూ భార్యకు స్వీట్ గా బర్త్ డే విషెస్ తెలియజేసాడు చైతు. ఆ ఫోటోలో నాగ చైతన్య హ్యాండ్సమ్‌ లుక్‌తో మతి పోగొట్టాడు. నాగ చైతన్య సెల్ఫీ తీస్తూ ఉండగా, శోభిత ఆయన భుజం పై తల పెట్టుకుని ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

Shobhita Birthday-Chaitu Special Post:

Naga Chaitanya Sweet Birthday Wishes to His Wife Sobhita
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs