Advertisement
Google Ads BL

మోహన్ లాల్ తుడరుమ్ ఓటీటీ టాక్


మలయాళంలో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలలో ముందు వరసలో మోహన్ లాల్ - శోభనల తుడరుమ్ ఉటుంది. మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం పాన్ భాషల్లోనూ భేష్ అనిపించింది. కాకపోతే పాన్ ఇండియా భాషల్లో తుడరుమ్ ని మోహన్ లాల్ అండ్ టీమ్ ఎక్కడా ప్రమోట్ చెయ్యలేదు, అయినా తుడరుమ్ చూసిన వారు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్స్ తో చాలామంది థియేటర్ కి వెళ్ళి ఆ సినిమా చూసారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు తుడరుమ్ జియో హాట్ స్టార్ నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. తుడరుమ్ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించిన ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. దృశ్యం లాంటి ఫ్యామిలీ, కారు బాడుగ కు తిప్పుకునే బెంజ్(షణ్ముగ మోహన్ లాల్). తన కారుని అపురూపంగా చూసుకుంటాడు(అచ్చం దృశ్యంలో కేబుల్ టివి ని చూసుకున్నట్టు) బెంజ్ కి ఫ్యామిలీ అంటే ప్రాణం. 

ఓ చిన్న కేసు కారణంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న కారు కోసం బెంజ్ ప్రయత్నాలు, ఈమద్యలో పోలీస్ లే బెంజ్ ని ఓ అడవికి తీసుకెళ్ళి రహస్యంగా ఓ శవాన్ని పాతిపెత్తడం, ఆతర్వాత బెంజ్ కొడుకు పవన్ మిస్సింగ్, దాని కోసం పోలీస్ స్టేషన్ లో బెంజ్ ఫ్యామిలీ పాట్లు ఇది  తుడరుమ్ కథ. 

సినిమా స్టార్ట్ అవడమే స్లో గా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ హాఫ్ అంతా నెమ్మదిగా సాగుతుంది, పోలీస్ ల ఓవరేక్షన్, మోహన్ లాల్ హడావిడి తో ఫస్ట్ హాఫ్ గడిచిపోయినా, సెకండ్ హాఫ్ లో సీన్స్ అన్ని మరో దృశ్యం చూశామా అనే ఫీలింగ్ కలిగింది అంటున్నారు ఓటీటీ ఆడియన్స్, మోహన్ లాల్ ఆయన భార్య శోభన ల మధ్యన రొమాన్స్ పండలేదు, అలాగే కొడుకు కోసం పోలీస్ లను చంపి మోహన్ లాల్ జైలుకెళ్లిన క్లైమాక్స్ పరమ రొటీన్ అంటూ తుడరుమ్ ఓటీటీ పై ప్రేక్షకులు మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. 

థియేటర్స్ లో అంత పెద్ద హిట్ అయిన తుడరుమ్ ని ఓటీటీలో చూసి చాలామంది ప్రేక్షకులు దీనికా ఇంత హైప్ క్రియేట్ చేసారు అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారు తుడరం ని ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. 

Thudarum OTT Talk:

Thudarum OTT Audience Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs