అనసూయ భరద్వాజ్ ఈమె పేరు తెలియని వారుండరు, అటు యాంకర్ గా ఇటు నటిగా ఆమె అందరికి సుపరిచితమే. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ భరద్వాజ్ ఈ మధ్యన తన నూతన గృహప్రవేశం ఫొటోస్ ను షేర్ చెయ్యడమే కాదు, తన ఇంటికి శ్రీరామ సంజీవిని ని అని పేరు పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. గృహాప్రవేశ పూజ ఫొటోస్ అలాగే కొడుకు ఒడుగు ఫంక్షన్ కి సంబందించిన ఫొటోస్ ని షేర్ చేసింది.
ఇక ఇంటి దగ్గర శుభకార్యాలతో అలసిపోయిన అనసూయ ఫ్యామిలీ ఇప్పుడు శ్రీలంక వెకేషన్ లో తేలింది. అక్కడ అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించిన అనసూయ ఆమె భర్త భరద్వాజ్, పిల్లలు కలిసి ఇపుడు హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొడుకులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో అనసూయ జలకాలాడుతున్న ఫోటొస్ ని, వీడియోస్ ని షేర్ చేసింది. అనసూయ కొడుకులతో కలిసి స్విమ్ చేస్తున్న వీడియోస్ వైరల్ అయ్యా యి.
ఎప్పుడు ఫ్యామిలీ వెకేషన్స్ తో ఎంజాయ్ చేసే అనసూయ ఈసారి శ్రీలంక లో తన భర్త, పిల్లలతో ఈ సమ్మర్ హాలిడేస్ ని గడుపుతుంది. ఉదయాన్నే యోగ చేస్తున్న పిక్స్, అలాగే పూల్ లో కొడుకులతో కలిసి అనసూయ జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ నెట్టింట్లో సంచలనంగా మారాయి.