Advertisement
Google Ads BL

వంశీ ని కోర్టు కూడా కనికరించడం లేదు


వల్లభనేని వంశీని చివరికి కోర్టు కూడా కనికరించడం లేదు. వంశీ గత రెండు రోజులుగా శ్వాస కోశ సమస్యతో బాధపడుతూ విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర విభాగంలో చికిత్స తీసుకుంటున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ వల్లభనేని ప్రస్తుతం కంకిపాడు పోలీస్ స్టేషన్ లో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు. 

Advertisement
CJ Advs

రెండురోజుల క్రితం వంశీ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయన్ని కంకిపాడు ఆసుపత్రికి తరలించి, అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం ఇప్పించి తిరిగి విజయవాడ జైలుకి తరలించారు. అయితే వల్లభనేని వంశీ తరపు లాయర్ ఆయనకు ఆరోగ్యం బాలేదు, మెరుగైన వైద్యం చేయించుకోవడం కోసం కోర్టుని మధ్యంతర బైలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. 

వంశీ లాయర్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై వచ్చే గురువారం విచారణ జరుపుతామని, అంతేకాకుండా అనారోగ్య సమస్యల కారణంగా మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ను  కూడా గురువారమే విచారణ జరుపుతామని కోర్టు చెప్పింది. అది చూసి వంశీ ని పోలీసులే కాదు ఆఖరికి కోర్టు కూడా కనికరించడం లేదు అంటూ టీడీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. 

Vamsi suffers health issues, but denied bail again:

Fake patta lands case - Ex-MLA Vamsi bail plea dismissed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs