Advertisement
Google Ads BL

లోకేష్ కి పట్టాభిషేకం-ఇదే సరైన సమయమం


నారా లోకేష్ రాజకీయ జీవితంలో యువగళం కి ముందు యువగళం తరువాత అంటూ టీడీపి అభిమానులు, కార్యకర్తలు మాత్రమేకాదు సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తన మార్క్ ను ప్రత్యేకంగా చూపించారు. యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అధికారం చేపట్టగానే వాటిని అమలుకు తగిన కృషి చేస్తున్న యువ నాయకుడు లోకేష్. ఒకపుడు లోకేష్ ను చూసిన ఎక్కిరించినవారే ఇప్పుడు ఆయనకొస్తున్న క్రేజ్ చూసి కుళ్ళుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

విద్యశాఖ మంత్రిగా నారా లోకేష్ ఆ శాఖలో తన ప్రత్యేకతను చూపడమే కాదు, ఇంకా ఇంకా రాజకీయాల్లో పాఠాలు నేచుకుంటూ..తండ్రి చంద్రబాబు దగ్గరే శిష్యరికం చేస్తున్నాడా అనిపించేలా అతని అడుగులు కనిపిస్తున్నాయనే మాట వినిపిస్తుంది. నేటి(మే 27) నుంచి మూడురోజులు పాటు కడప లో టీడీపీ మహానాడు ని నిర్వహిస్తుంది. 

టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కోకోల్లలుగా తరలివచ్చి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడమే కాదు లోకేష్ కి పట్టాభిషేకం చెయ్యాలంటూ తమ గళాన్ని చంద్రబాబు కి వినిపిస్తున్నారు. టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని నారా లోకేష్ కి ఇస్తున్నట్టుగా టాక్ వినిపించడంతో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. చంద్ర‌బాబుకు ఇప్పుడు 75 సంవ‌త్స‌రాలు, ఆయన రాష్ట్రాన్ని చూసుకుంటే.. లోకేష్ తమని చూసుకుంటాడు, కాబట్టి లోకేష్ ని తమ నాయకుడిగా ప్రకటించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. 

ఇప్పుడు మహానాడు కార్యక్రమమే నారా లోకేష్ కి పట్టాభిషేకం చెయ్యడానికి స‌రైన స‌మ‌యం అంటూ పార్టీ సీనియ‌ర్లు, యువ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అదే చంద్రబాబు కి చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి యువ‌త పెరిగే అవ‌కాశం ఉన్నందున వారిని మొబిలైజ్ చేసి.. వారి ఓటు బ్యాంకును ఆక‌ర్షించేందుకు నారా లోకేష్‌ కి పట్టాభిషేకం చెయ్యాలనే డిమాండ్ ఎక్కువైంది. చూద్దాం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఈ మూడురోజుల్లో అనేది. 

Nara Lokesh:

Minister Nara Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs