మే 27 నుంచి మూడురోజుల పాటు కడప జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా పసుపు జెండాలు, తోరణాలు, పసుపు చొక్కాలతో కళకళలాడిపోతుంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉత్సహంగా మహానాడును పసుపు పండగగా మార్చేశారు. ఈరోజు మే 27 న మొదలైన మహానాడు ప్రాంగణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిజిస్టేషన్ చేయించుకుని నేతలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహానాడుని ప్రారంభిస్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలు..
* మహానాడు అంటే నాటి నుంచి నేటి వరకు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అదే జోరు.. అదే హోరు.
* దేవుని గడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతోంది..ఈ మహానాడు దశ, దిశ నిర్దేశిస్తుందని గట్టిగా చెబుతున్నా.
* కడప జిల్లాలో 10 స్థానాలకు 7 గెలిచి సత్తా చాటాం..వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం కష్టపడితే 10/10 స్వీప్ చేస్తాం.
* 2024 ఎన్నికల్లో 57 శాతం ఓట్లు సాధించాం..టీడీపీకి ఘన విజయం అందించిన తెలుగుదేశం కార్యకర్తలకు కృతజ్ఞతలు.
* కార్యకర్తల పోరాటాలతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.. పీక కోస్తుంటే కూడా జై టీడీపీ అని చంద్రయ్య ప్రాణాలు వదిలేశారు, చంద్రయ్య వంటి వారి స్ఫూర్తి టీడీపీని నడిపిస్తోంది..పసుపు సింహం తోట చంద్రయ్య.
* కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నా..త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం.
* దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం..టీడీపీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పని అయిపోయింది..టీడీపీ జెండా ఎప్పటికీ రెపరెపలాడుతునే ఉంటుంది.
* తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుంది..తెలుగు వారి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్.
* పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం..రూ.2కి కిలో బియ్యం, సబ్సిడీ కరెంట్ తెలుగుదేశం తెచ్చినవే.
* టీడీపీ కార్యకర్తలే నా ఆయుధాలు..కార్యకర్తలతో కలిసి ఆకాశమేహద్దుగా అభివృద్ధి చేస్తాం.
* రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే.
* గతాన్ని స్మరిస్తూ... భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ...తెలుగు ప్రజల ఆశయాలను చాటే ఉద్యమానికి వేదిక మహానాడు 2025.
* ఈ మహానాడు-2025 చరిత్రలో నిలిచిపోతుంది.. అంటూ కార్యకర్తలను చంద్రబాబు ఉత్సాహారుస్తూ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది.