Advertisement
Google Ads BL

పీఆర్ గేమ్ పై స్పిరిట్ డైరెక్టర్ సందీప్ ఫైర్


బాలీవుడ్ లో కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుని హీరోయిన్ గా దీపికా కు స్పిరిట్ మూవీ కథ చెప్పి ఆమెను హీరోయిన్ గా సెలక్ట్ చేసాక, ఆమె వర్కింగ్ స్టయిల్ సందీప్ రెడ్డి కి నచ్చక ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించి దీపికా పదుకొనె స్థానంలో యానిమల్ ఫేమ్  బ్యూటీ త్రిప్తి డిమ్రి ని తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. 

Advertisement
CJ Advs

ఈలోపు స్పిరిట్ స్టోరీ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది, అయితే ఇదంతా చేసింది దీపికా పీఆర్ టీమ్ అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు కలకలం సృష్టించింది. మీరు ఏం చేసినా నన్ను ఏం చేయ‌లేరు.. ఈ సారి (స్పిరిట్)మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి.. అంటూ ఫైర్ అవుతూ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. 

నేను ఓ నటి ని 100 పెర్సెంట్ నమ్మి క‌థ‌ చెబుతాను. మా మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ మీరు కథను లీక్ చేసి మీది మీరే బయటపెట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ నటిని కిందకు లాగడం, ఆమెను విమర్శించడం, నా స్టోరీని లీక్ చేయడం.. ఇదేనా మీ ఫెమినిజం. ఒక సినిమా చెయ్యడానికి ఎన్నో ఏళ్లు క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. నాకు సినిమానే ప్రపంచం.. మీకు ఇది అర్థం కాదు. ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా. మొత్తం కథను బయటపెట్టేసినా నాకు పోయేదేమీ లేదు అంటూ సందీప్ రెడ్డి వంగ డర్టీ పీఆర్ గేమ్ అంటూ హాష్ ట్యాగ్ ను జోడించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 

Sandeep Vanga Slams dirty PR games:

Sandeep Reddy Vanga Scathing Response on dirty PR games
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs