మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక వరస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన సినిమాలు ఏడాదికో లేదంటే ఏడాదిన్నరకో థియేటర్స్ లోకి వచ్చాయి. వస్తున్నాయి. ఇప్పుడు విశ్వంభర పరిస్థితి చెప్పక్కర్లేదు. కానీ మెగాస్టార్ ని కూర్చోనివ్వకుండా, నించోనివ్వకుండా పరిగెత్తిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.
#Mega157 పూజా కార్యక్రమాలతోనే సెన్సేషన్ క్రియేట్ చేసాడు, అంతేకాదు అనిల్ రావిపూడి నయనతారను ఈ ప్రాజెక్టు లోకి తీసుకొస్తూ చేసిన వీడియో తో అందరిని షాకయ్యేలా చేసాడు. రెగ్యులర్ షూటింగ్ లోను చిరును పరిగెత్తిస్తున్నాడు. ప్రస్తుతం చిలుకూరు ప్రాంతంలో #Mega157 షూట్ జరుగుతోంది, ఈ వారంలోనే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లోకి #Mega157 షూట్ షిఫ్ట్ అవుతోంది అని తెలుస్తుంది.
జూన్ మొదటి వారం తరువాత డెహ్రాడూన్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు అని సమాచారం. ఈ లెక్కన ఎలాంటి బ్రేక్ లేకుండా అనిల్ రావిపూడి షూటింగ్ కంప్లీట్ చేసేసి సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసేయాలని కసితో కనిపిస్తున్నాడు. అందుకే అనేది మెగాస్టార్ ని అనిల్ పరుగులు పెట్టిస్తున్నాడు అని.