మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మరో నెల రోజులు అంటే జూన్ 27 న పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుండగా.. మంచు విష్ణు శక్తిమేర కన్నప్ప ను ప్రమోట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు కన్నప్ప లో గెస్ట్ రోల్స్ చేస్తుండడంతో సినిమాపై అంచనాలు బావున్నాయి.
అయితే విఎఫెక్స్ కోసం సరైన వ్యక్తిని ఎంచుకోకపోవడమే తమ తప్పని, అదే కన్నప్ప పలుమార్లు వాయిదా పడేందుకు కారణమైంది అంటూ మంచు విష్ణు రీసెంట్ ఇంటర్వ్యూలో కన్నప్ప వాయిదాలు మీద వాయిదాలు పడడంపై ఓపెన్ అయ్యారు, ఇంతలోపులో కన్నప్ప కు అనుకోని కష్టం వచ్చి పడింది.
అదేమిటంటే కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు వ్యక్తులు పరారీ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను, ఫిల్మ్ నగర్ లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా పంపిన ముంబాయి హెచ్ఐవీఈ స్టూడియోస్, ఆ పార్సిల్ ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడని, అప్పటి నుండి వారిద్దరు కనిపించడంలేదని తెలిపిన ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ.
అయితే ఇదంతా కొంతమంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.