Advertisement
Google Ads BL

లీగల్ గా ప్రొసీడవుతున్న జయం రవి గర్ల్ ఫ్రెండ్


జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వడానికి కారణం ఆయన తన వైవాహిక జీవితంలో విసిగిపోయాను, వివాహ బంధంలో తాను ఇమడలేకనే భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లుగా ఓపెన్ అయ్యారు, ఆయన భార్య ఆర్తి మాత్రం జయం రవి తనని, పిల్లలని పట్టించుకోకుండా మూడో వ్యక్తి కోసమే తనకు రవి విడాకులు ఇస్తున్నాడని, తనకు విడాకులు ఇస్తే నెలకు 40 లక్షల భరణాన్ని ఆమె డిమాండ్ చేసింది. ఈ విడాకుల మొత్తం లో సింగర్ కేనీషా పేరు ప్రముఖంగా వినబడింది. 

Advertisement
CJ Advs

జయం రవి కేనీషా తో డేటింగ్ చెయ్యడం వలనే భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అందులోను ఓ పెళ్ళిలో రవి-కేనీషాలు జంటగా కనిపించడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చగా జయం రవి మాత్రం కేనీషా చాలా మంచిది, ఆమె చాలా కష్టపడి పైకొచ్చింది. తాను అర్ధరాత్రి నడిరోడ్డుపై కట్టుబట్టలతో నిలిచుంటే ఆమె తనకు సపోర్ట్ గా నిలబడింది, కేనీషా ను ఏమైనా అంటే ఊరుకోను అన్నారు. 

ఆర్తికి సపోర్ట్ చేస్తూ చాలామంది కేనీషా ను బెదిరించడం హాట్ టాపిక్ అయ్యింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని కేనీషా రీసెంట్ గానే సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపులు శ్రుతిమించడంతో, వీటిపై చట్టపరంగా ముందుకెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. 

కెనీషా పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా, ఒకవేళ బెదిరింపులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఆమె టీమ్  స్పష్టం చేసింది. ఇన్‌స్టా లో వస్తున్న అసభ్యకరమైన, అశ్లీల సందేశాల వల్ల కెనీషా తీవ్ర మానసిక వేదనకు లోనవవుతుంది అని.. ఇలాంటి మెసేజ్‌లు పంపే వారి స్క్రీన్‌షాట్లను ఆధారంగా చేసుకుని లీగల్ నోటీసులు పంపుతామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Keneesha has decided to take legal action against online trolls:

Keneeshaa Francis Issues Legal Warning Against Trolls 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs