పవన్ కళ్యాణ్ - సుజిత్ కలయికలో తెరకెక్కుతున్న OG నుంచి పవన్ ఫ్యాన్స్ కోసం బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ కళ్యాణ్ తాజాగా OG బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసేందుకు OG సెట్ లోకి అడుగుపెట్టడంతో దర్శకుడు సుజిత్ చకచకా OG షూటింగ్ కంప్లీట్ చేస్తూ ఉండడంతో నిర్మాత దానయ్య ధైర్యం చేసి OG డేట్ లాక్ చేసేసారు.
ముందు నుంచి OG సెప్టెంబర్ అంటూ ప్రచారం జరిగినట్టే OG ని సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నట్టుగా సైలెంట్ గా సునామి అప్ డేట్ ని అందించారు OG మేకర్స్. He’ll see you on 25.09.25 🔥 #OG #TheyCallHimOG అంటూ సెప్టెంబర్ 25 న OG ని పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. దానితో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ రెండు వారాల OG డేట్స్ ని ఫినిష్ చేసేందుకు సిద్దమవడమే కాదు, ఆయన సెట్ లోకి రావడంతో మేకర్స్ ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా రిలీజ్ తేదీని లాక్ చేసి అనౌన్స్ చేసేసారు. దానితో పవన్ ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ పండగలే, జూన్ 12 న వీరమల్లు, మూడు నెలల్లోనే OG రాబోతుంది. మరి పండగ కాక ఇంకేమిటి.