మంచు మనోజ్ ప్రస్తుతం మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్నాడు. ఆస్తి వివాదాలు, అన్నదమ్ములైన విష్ణు, మనోజ్ కి పడకపోవడం, మనోజ్ పెళ్లి విషయంలో మోహన్ బాబు, విష్ణు ఒక సైడ్, మనోజ్, అతని అక్క లక్ష్మి ఒక సైడ్ ఉండడం ఇవన్నీ మీడియాలో కనిపించిన విషయాలే. ఇక ఇప్పుడు ఆస్తి గొడవలు పరాకాష్టకు చేరడం అది కాస్తా తండ్రి కొడుకుల నడుమ గొడవగా మారిపోయింది.
తాజాగా మంచు మనోజ్ భైరవం చిత్ర ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అవుతున్నాడు. తన తండ్రి మోహన్ బాబు అంటే చాలా ఇష్టమని, మా నాన్న కాళ్ళు పట్టుకోవాలనుంది అన్న మంచు మనోజ్ మా నాన్న నా కూతురు దేవసేనను ఎత్తుకుంటే చూడాలని ఉంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. మా నాన్నపై ఎలాంటి కోపము లేదు అంటూ మనోజ్ కామెంట్స్ చేసాడు.
ఇక ప్రస్తుత పరిణామాల వల్ల తన తల్లిని మిస్ అవుతున్నట్లుగా చెప్పిన మనోజ్ ఆమెను కలవాలంటే ఆమె ఇంటి నుంచి బయటికి రావాలి, ఆమె చుట్టూ చాలా రిస్టిక్షన్స్ ఉన్నాయి. మా అమ్మకు నా కూతురు అంటే చాలా ఇష్టం, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి చూసి వెళుతుంది. మౌనిక చిన్నప్పుడే తల్లి తండ్రులను కోల్పోయింది, ఆమెకు ఆ బాధ ఏమిటో బాగా తెలుసు, తాను చాలా కష్టపడింది, నా ఫ్యామిలీకి నేనున్నాను అంటూ మనోజ్ ఆ ఇంటర్వ్యూలో ఫ్యామిలీ విషయాలు మట్లాడుతూ ఎమోషన్ అయ్యాడు.