త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేష్ బాబు కలయికలో తెరకెక్కిన ఖలేజా చిత్రం అప్పట్లో థియేటర్స్ లో హిట్ అవ్వలేదు. కానీ ఆ చిత్రం బుల్లితెర పై భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఖలేజా లో సూపర్ స్టార్ మహేష్ కామెడీ ని ఆడియన్స్ ఇప్పటికీ బుల్లితెరపై ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మహేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రముడు డైలాగ్స్ అన్ని ఈ చిత్రాన్ని బుల్లితెర ఆడియెన్స్ ని పడేసేలా చేసాయి.
అయితే డైరెక్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన మహేష్ ఖలేజా అప్పుడు ప్లాప్ అయితే.. ఇప్పుడు రీ రిలీజ్ లో ఖలేజా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2010లో విడుదలైన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మే 30 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు రంగం సిద్దం అయింది. బుక్ మై షో లో ఖలేజా టికెట్లు హాట్ కేకుల్లా బుకింగ్ అవుతుండడం విశేషం.
ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 స్క్రీన్‌లలో రీ-రిలీజ్ అవుతుంది. రీ-రిలీజ్‌లలో చిత్రాలలో ఈ స్థాయిలో స్క్రీనింగ్ లలో విడుదల అవడంలో రికార్డు సృష్టించింది. అంతే కాదు అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు సృష్టిస్తుంది. బుక్ మై షోలో ఇప్పటికే 100 కే పైగా టికెట్లు బుక్ అయ్యాయి అంటేనే సినిమాకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. మరి రీ రిలీజ్ కి ముందే ఖలేజా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది అనే చెప్పాలి.