చెప్పినట్టే జరిగింది, విజయ్ సాయి రెడ్డిని ఎక్కువగా కెలకొద్దు జగన్ అంటే.. విన్నారా, వినలేదు. లిక్కర్ స్కామ్ లో తమ నేతలను అడ్డంగా ఇరికించిన విజయ్ సాయిరెడ్డి నిజాయితీని తప్పుబట్టి, చంద్రబాబు కి అమ్ముడు పోయాడు అంటే సాయి రెడ్డి ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు, జగన్ గురించి బాగా తెలిసిన వ్యక్తి అందుకే జగన్ ని ఇప్పుడు ఇండైరెక్ట్ గా బెదిరించడం స్టార్ట్ చేసారు ఆయన.
రీసెంట్ గా జగన్ విజయ్ సాయి రెడ్డి కూటమి ప్రభుత్వానికి ఫేవర్ చెయ్యడానికే మూడున్నరేళ్ళ పదవీకాలం ఉన్న రాజ్యసభ ఎంపీ పదవిని వదిలేసారు, చంద్రబాబుకి విజయ్ సాయి రెడ్డి అమ్ముడుపోయారంటూ దారుణంగా సాయి సాయి రెడ్డిపై నినాదాలు వేశారు జగన్. దానితో సాయి రెడ్డి కి చిరాకొచ్చింది. జగన్ ని ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టారు.
నేను మారలేదు నువ్వే మారిపోయావు (జగన్)
నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నువ్వే పదవి వచ్చాక మారిపోయావు!
మూడు దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబం తో అనుబంధం ఉంది. పెళ్ళి చేసుకున్న వారే విడిపోతున్నారు, మాది రాజకీయ బంధం, ఇందులో ఆశ్చర్యం ఏముంది?
ప్రలోభాలకు లొంగను, ఎవ్వరికీ భయపడను, విశ్వసనీయత కోల్పోయే తత్వం కాదు.
మద్యం కేసు సిట్ చూస్తోంది. కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. భవిష్యత్ లో ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే చెబుతానేమో!
భక్తి ఇప్పుడూ ఉంది అప్పుడూ ఉంది. కాకపోతే గతంలో మా నాయకుడి మీద ఉండేది. ఇప్పుడు దేవుడి మీద మాత్రమే ఉంది.
ఆయనకు ఇంకా నాగురించి ఏమి తెలియదు. నేను ఎవ్వరి ప్రలోభాలకు లొంగే రకం కాదు.
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్నో బాధలు పడ్డాను. అయినా అక్కడ ఉంటే నా బాధలు తగ్గవని అర్ధమైంది. అందులోంచి తప్పుకున్నాను. ప్రశాంతంగా హాయిగా వున్నాను..అంటూ జగన్ పేరు ఎత్తకుండానే నన్ను కెలకొద్దు, కెలికితే నీకు బాగోదు అని జగన్ పేరెత్తకుండానే విజయ్ సాయి రెడ్డి ఇండైరెక్ట్ గా హెచ్చరించారు. .