2025 సమ్మర్ ని స్టార్ హీరోలు చేజేతులా వదిలేసుకున్నారు. ఈ సమ్మర్ సెలవలన్నీ వృధాగా పోయాయి. ఏప్రిల్, మే ప్రతి వారము చిన్న సినిమాల సందడి తప్ప భారీ బడ్జెట్ మూవీ కానీ, పాన్ ఇండియా మూవీ కానీ విడుదల కాలేదు. మెగాస్టార్ మొదలుకుని పవన్ కళ్యాణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ ఇలా ఏ ఒక్కరూ సమ్మర్ ని యూస్ చేసుకోలేదు.
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మే 9 నుంచి జూన్ 12 కి షిఫ్ట్ అయ్యింది. అప్పటికి సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యి పిల్లలకు స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఇక మెగాస్టార్ విశ్వంభర, ప్రభాస్ రాజా సాబ్ సినిమాల మాట చెప్పక్కర్లేదు. ఎప్పుడో జనవరిలో విశ్వంభర, ఏప్రిల్ లో రాజా సాబ్ లు పోస్ట్ పోన్ అయ్యి ఇప్పటికి రిలీజ్ తేదీలకు నోచుకోవడమే లేదు.
ఈ సమ్మర్ లో విశ్వంభర, రాజా సాబ్ విడుదలై ఉంటే అద్దిరిపోయేది అనేది ఆయా హీరోల అభిమానుల మాట. నిజమే సమ్మర్ అంటే సినిమాలకు అతిపెద్ద మార్కెట్ అనే చెప్పాలి. అలాంటి సమ్మర్ ని హీరోలు అలా చూసి చూడనట్టుగా పోవడమే ఆడియన్స్ కు మింగుడు పడడం లేదు.
ఇక మే 30 న అనుకున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కూడా జులై 4 కి వెళ్ళిపోయింది. మరి జూన్ మొదటి వారం అంటే థగ్ లైఫ్ నుంచి అసలు సిసలు సినిమాల రిలీజ్ లు ఉండబోతున్నాయి. కానీ అప్పటికే జనాలు స్కూల్స్ ఓపెనింగ్ మూడ్ లోకి వెళ్ళిపోతారు.