మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి బీఆర్ఎస్ కి షాక్ తగలబోతుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కొన్నాళ్లుగా అంటే కవిత జైలు కు వెళ్లి వచ్చినప్పటినుంచి ఆమె పార్టీలో ప్రాధాన్యం కోసం పోరాడుతుంది, అన్న కేటీఆర్, చెల్లెలు కవిత నడుమ కోల్డ్ మొదలైంది అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కేటీఆర్ కి కవితకు మధ్యన సయోధ్య చెయ్యలేక కేసీఆర్ నలిగిపోతున్నారు, కేటీఆర్ చెల్లెలు కవిత ను పక్కకు తప్పించడానికి రెడీగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు తన చేతుల్లోకి తీసుకుని లిక్కర్ స్కామ్ లో మరక అంటించుకున్న కవితను బీఆర్ఎస్ కి దూరం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. మరోపక్క కేటీఆర్ ఎక్కువగా హారిష్ రావు తో చర్చలు జరుపుతున్నారు, వీరిద్దరూ కలిసి కవితకు చెక్ పెట్టడం గ్యారెంటీ అంటూ రాజకీయవర్గాల్లో కామెంట్స్ వినబడుతున్నాయి.
తాజాగా కవిత వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్ సభ పై తండ్రి కేసీఆర్ కి సంచలన బహిరంగ లేఖ సంధించడండం చర్చనీయాంశం అయ్యింది. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సింది
2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేది
ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యాం
బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేది
భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారు
నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ
బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ
మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది
ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారు. ఇప్పటికైనా 1-2 ప్లీనరీ పెట్టాలి అంటూ లేఖలో తండ్రి కేసీఆర్ కు కవిత ఘాటైన పదాలను సంధించింది. మరి ఈలెక్కన కవిత తండ్రి కేసీఆర్ కి ఎదురు తిరిగినట్టుగానే కనిపిస్తుంది.. అంటూ కాంగ్రెస్ వాళ్ళు తమకు ఆయుధం దొరికింది అనుకుంటూ సంబరపడిపోతున్నారు.