నిన్నమొన్నటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలను ఎప్పుడు పూర్తి చెస్తారొ తెలియక పవన్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ సతమతమయ్యారు, అటు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కూడా తెగ టెన్షన్ పడిపోయారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఏడాది కి కాస్త ఫ్రీ అయ్యి ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్ పూర్తి చేస్తున్నారు.
ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చెయ్యడమే కాదు.. సుజిత్ దర్శకత్వంలో OG పూర్తిచేయడానికి రెడీ అయ్యారు. ఇదే షాకింగ్ అనుకుంటే.. ఇప్పుడు ఉస్తాద్ భగత్లో సింగ్ సెట్ లోకి జూన్ లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్టుగా పవన్ కళ్యాణ్ స్పీడు కనిపిస్తుంది.
మిత్రమా ఊపిరి పీల్చుకో.. పవన్ వస్తున్నారు.. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాలు థియేటర్స్ లో ఒకదాని వెంట మరొకటి వచ్చేస్తాయి.. సంబరాలకు సిద్దమవ్వమంటూ పవన్ ఫ్యాన్స్ తమలో తామే మాట్లాడుకుంటున్నారు