Advertisement
Google Ads BL

యంగ్ హీరోకి డాడీగా ప్ర‌మోష‌న్


``హీరో అవ్వ‌డం అనేది వెయ్యి జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం`` అని వెన‌క‌టికి ఒక పెద్ద‌ ప్రొడ్యూస‌ర్ చెప్పారు. ఒక సాధార‌ణ యువ‌కుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరో అయ్యాడు. అనుకున్న‌ది సాధించుకున్నాడు. యువ‌హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న హీరో. అత‌డు ఒక్కో మెట్టు తెలివిగా ఎక్కుతున్నాడు. వృత్తిపరంగా, వ్య‌క్తిగ‌తంగాను అత‌డు హ్యాపీ లైఫ్ ని ఆస్వాధిస్తున్నాడు.

Advertisement
CJ Advs

కిరణ్ అబ్బవరం - అతడి భార్య రహస్య గోరక్ ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు. ఈ జంట తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసారు కిర‌ణ్. తన బిడ్డ(అబ్బాయి) చిట్టి పాదాలను ముద్దు పెట్టుకుంటున్న అందమైన ఫోటోను కూడా అత‌డు షేర్ చేసారు. ``మగబిడ్డతో మాకు ఆశీర్వాదం దొరికింది.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ర‌హ‌స్య కిర‌ణ్ కు ధన్యవాదాలు`` అనే క్యాప్ష‌న్ ని కిరణ్ ఇచ్చారు. ఈ శుభవార్త చెప్పిన వెంట‌నే కిర‌ణ్ కి త‌న‌ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. న‌టి రుక్సార్ థిల్లాన్ హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు! స్రవంతి చోకరపు వావ్ అంటూ అభినందనలు తెలియజేసారు. 

కిరణ్ అబ్బవరం- రహస్య గోరక్ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 22 ఆగస్టు 2024న కర్ణాటకలోని కూర్గ్‌లో ఘ‌న‌మైన‌ పెళ్లి వేడుకలో ఒక‌ట‌య్యారు. ఈ వివాహం ఒక అందమైన రిసార్ట్‌లో జరిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో వైభవంగా పెళ్లి జ‌రిగింది. ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బ‌వ‌రం తండ్రి అయినందుకు `సినీజోష్` టీమ్ శుభాకాంక్ష‌లు తెలియజేస్తుంది.

Kiran Abbavaram becomes a proud father:

Kiran Abbavaram blessed with a baby boy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs