Advertisement
Google Ads BL

భైరవం కాంట్రవర్సీ-దర్శకుడు క్షమాపణలు


భైరవం దర్శకుడు విజయ్ కనకమేడల ఆ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పొలిటికల్ హీట్ తెప్పించాయి. విజయ్ కనకమేడల పై ఆగ్రహంతో బాయ్ కాట్ భైరవం హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చెయ్యడం చూసారు. విజయ్ కనకమేడల మరొక కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఈసారి మెగా ఫ్యాన్స్ నుంచి విజయ్ కి సెగ తగిలింది. అది సినిమాకి ఎఫెక్ట్ ఎవుతుందేమో అని భయపడి విజయ్ కనకమేడల మెగా అభిమానులకు సారీ చెప్పారు.   

Advertisement
CJ Advs

నమస్కారం 

అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..

మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నారు. కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక 30 మినిట్స్ నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది. ఎప్పుడో 2011లో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు.. ఏదో జరిగింది.. హ్యాక్ అయి ఉంటుంది. నేను అందరు హీరోలతో పని చేశాను.. ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. మెగా హీరోలు అందరితోనూ నాకు సానిహిత్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి. అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని..! అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను.. అలాంటి తప్పు ఎందుకు చేస్తాను..? నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది.. తెలిసో తెలియకో జరిగింది.. అది హ్యాక్ అయింది.. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను.. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు.. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు.. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికీ.. మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను.

మీ 

విజయ్ కనకమేడల

Another Boycott controversy hits Bhairavam:

Bhairavam faces another Boycott trend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs