వైస్సార్సీపీ పార్టీ పెట్టినప్పటి నుండి నిన్నమొన్నటివరకు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి విధేయుడిగా, నమ్మకస్తుడిగా, పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో పవర్ ఫుల్ గా కనిపించిన విజయ్ సాయి రెడ్డి ఉన్నట్టుండి వైసీపీ పార్టీకే కాదు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసేసి, తనను విచారణకు పిలిచిన కేసుల్లో వైసీపీ నేతలను ఇరికిస్తూ ఆయన పని ఆయన చూసుకుంటున్నారు.
ముఖ్యంగా విజయ్ సాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో నిందితుల పేర్లు సిట్ విచారణలో బయటపెట్టడంతో సిట్ అధికారులు ఆ కేసులో ఐదుగురు వైసీపీ వాళ్ళను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు. మిదున్ రెడ్డి బెయిల్ కోసం అగచాట్లు పడుతున్నాడు. ఫైనల్ గా ఈకేసులో జగన్ అరెస్ట్ తధ్యమన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి తన హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని వాదించడం విశేషం.
ఈ కేసు విచారణలో పలువురు వైసీపీ నేతలు పేర్లు బయటపెట్టిన విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు కి లొంగిపోయారంటూ కడుపుమంటతో పలు వ్యాఖ్యలు చేసారు జగన్. ఇంకా మూడున్నరేళ్ల పాటు ఎంపీ పదవి ఉన్న విజయ సాయి రెడ్డి చంద్రబాబు కి లొంగిపోయి, కూటమి ప్రభుత్వానికి సహాయం చేసేందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసి, పార్టీకి తీరని అన్యాయం చేసారు అంటూ జగన్ విజయ్ సాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు.
అంతేకాదు రాజ్ కసిరెడ్డి సుద్దపూస, రాజ్ కాసిరెడ్డికి లిక్కర్ స్కామ్ కు అసలు సంబంధమే లేదు అంటూ జగన్ చెప్పడం విడ్డురంగా ఉంది.