ఉప్పెన చిత్రంలో విలన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవ్వకముందే ఆయన 96 లాంటి క్లాసిక్ చిత్రంతో తెలుగుప్రేక్షకుల హృదయాన్ని దోచేశారు. ఆ తర్వాత మహారాజ తో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించుకున్నారు. అలాంటి హీరో విజయ్ సేతుపతి నుంచి కొత్త చిత్రం వస్తుంది అంటే ఎంతో కొంత హడావిడి కనిపిస్తుంది.
విజయ్ సేతుపతి కొత్త చిత్రం Ace రేవు శుక్రవారమే విడుదల కాబోతుంది. ఆచిత్రంపై తెలుగులో ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించడం లేదు. మరోపక్క Ace హడావిడి కూడా లేదు, ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసారు మమ అనిపిస్తున్నారు. గతంలో విజయ్ సేతుపతి తన సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేసేవారు.
కానీ Ace విషయంలో విజయ్ సేతుపతి లైట్ గా ఉన్నారు, అదే సమయంలో ఆడియన్స్ లోను ఆ చిత్రం పై ఎలాంటి అంచనాలు కనిపించడం లేదు, ట్రేడ్ లోను బజ్ లేదు. మరి మహారాజా సినిమాకి ఇలాంటి పరిస్థితా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.