యాంకర్ నుంచి నటిగా ఉన్నతమైన స్థానంలోకి వెళ్లిన అనసూయ సోషల్ మీడియాలో ఎంత ఫేమసో, కాంట్రవర్సీలలోను అంతే ఫేమస్. అనసూయ కార్ కొన్నా, లేదంటే ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లినా, ఇల్లు కొనుక్కున్నా ఆమెపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తాయి. తన ఫ్యామిలీతో కలిసి అనసూయ ఎంజాయ్ చేస్తున్నా ఆమెను ట్రోల్ చేస్తారు. అందుకే అనసూయ కూడా ప్రతి ఒక్క విషయంలో ఘాటుగా రియాక్ట్ అవుతుంది, ఎవరేమనుకున్నా తాను అనుకున్నదే మాట్లాడుతుంది.
తాజాగా తన ఆస్తులు, తన కార్లు, తనపై ఐటి రైడ్స్ జరిగినప్పుడు, ఇంకా తన డ్రెస్సింగ్ స్టయిల్ పై కామెంట్లు పెట్టే వారికి నిఖిల్ పాడ్ కాస్ట్ లో అనసూయ దిమ్మతిరిగే సమాధానాలిచ్చింది. అంతేకాదు జబర్దస్త్ లో నేను నవ్వు నటించేదాన్ని అనేవారు. కానీ జబర్దస్త్ లో కామెడీకి అందరూ నవ్వేవారు. జబర్దస్త్ కామెడీ షోకి యాంకరింగ్ చేసినందుకు నేను ప్రౌడ్ గా ఫీలవుతున్నాను. ప్రతీ గురువారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాలి, ఏదొక ఫోటో షూట్ ను అప్ లోడ్ చేయాలనే ఒత్తిడి ఉండేది.
అనసూయకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమెకు ప్రొడ్యూసర్స్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. 2 కోట్లు పెట్టి కారు కొనిందా అంటుంటారు. అలాంటి కారు కొన్నానంటే అది కేవలం నా ఒక్కదాని కష్టం కాదని, దాని వెనుక నా ఫ్యామిలీ కష్టం కూడా ఉంది. ఎంత సంపాదించినా ఇప్పటికి నాది మిడిల్ క్లాస్ మెంటాలిటీనే, నాకు ఆస్తులు ఎంతున్నాయో తెలియదు, ఆస్తుల లెక్కలేసుకోను, ఇప్పటికి పోపుల డబ్బాలో డబ్బులు దాచుకుంటాను, తనకు తెలిసిందల్లా హాలీడే ట్రిప్స్, ఎంజాయ్‌మెంట్స్ మాత్రమేనని చెప్పింది.
ఇంత తెలివైన అనసూయ కు జీఎస్టీ అంటే ఏమిటో తెలియదట. అందుకే కొన్ని టీవీ షోస్ కి తీసుకున్నపేమెంట్స్ కి జీఎస్టీ కట్టక తనపై ఐటి రైడ్స్ జరిగాయని.. తాను, తన భర్త ఎంతో కష్టపడి నెలకు రూ. లక్షా పదహారు వేల ఈఎంఐ కడుతూ కొనుకున్న ఆడి కారును ఎవరో గిఫ్ట్ ఇచ్చారని ప్రచారం చేసారు, అంతేకాదు నాది కానిది నాకొద్దు, నాది అన్నదానిని దేన్నీ వదలని అనసూయ నిక్కచ్చిగా చెప్పుకొచ్చింది.