పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వర్క్ చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది, అస్సలు వదులుకోరు. కానీ దీపికా పదుకొనె ప్రభాస్ తో మరోసారి వర్క్ చేసే అవకాశం వదులుకుంది అనే వార్త వైరల్ అయ్యింది. కల్కి చిత్రం లో ప్రభాస్ పని చేసిన దీపికా పదుకొనె కి ప్రభాస్ సందీప్ వంగ తో చెయ్యబోయే పాన్ ఇండియా మూవీ స్పిరిట్ లోను ఛాన్స్ వరించింది.
ఇక స్పిరిట్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళుతుందా అని ఎదురు చూస్తున్న సమయంలో దీపికా పదుకొనే స్పిరిట్ నుంచి తప్పుకుంది అనే న్యూస్ ప్రభాస్ అభిమానులను డిజప్పాయింట్ చేసింది. అయితే దీపికా స్పిరిట్ నుంచి తప్పుకోవడానికి కారణం సందీప్ రెడ్డి వంగ పెట్టిన కండిషన్స్ కారణమని తెలుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కే సందీప్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెట్టారనే వార్త మాములుగా సెన్సేషన్ అవ్వలేదు.
అదేవిషయంలో దీపికా ను కూడా టైమ్ కి సెట్ కి రావాలి, అవసరమైతే డేట్స్ అడ్జెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది, ఇలా కొన్ని విషయాల్లో సందీప్ రెడ్డి పెట్టిన కండిషన్స్ కి దీపికా హార్ట్ అయ్యి స్పిరిట్ నుంచి తప్పుకుంది అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీపికా తప్పుకోవడంతో ప్రభాస్ కోసం మరో హీరోయిన్ ని వెతుకుతున్నారట సందీప్ వంగ. చూద్దాం ఫైనల్ గా ఏ హీరోయిన్ ప్రభాస్ కి సెట్ అవుతుందో అనేది.