ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ ల పర్వం కొనసాగుతుంది. మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో రాజ్ కాసిరెడ్డిని సిట్ అధికారులు అనూహ్య రీతిలో అరెస్ట్ చెయ్యడంతో పలువురు బడా వైసీపీ రాజకీయనేతల పేర్లు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ కేసులో సజ్జల, ధనుంజయ్ రెడ్డి పేర్లతో పాటుగా జగన్ పేరు ప్రముఖంగా వినబడుతుంది. ఇప్పటికే సిట్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లను అరెస్ట్ చేసి రిమండ్ కు తరలించింది. రాజ్ కసిరెడ్డి విచారణ కొనసాగుతుంది.
అయితే ఎంతమంది అరెస్ట్ అయినా ఏపీ లిక్కర్ స్కామ్ లో మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అరెస్ట్ చేసే వరకు కూటమి ప్రభుత్వం నిద్రపోయేలా లేదు. ఇప్పటికే పేర్ని నాని లాంటి వాళ్లు జగన్ అరస్టే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ విచారణ నడిపిస్తుంది అంటూ జగన్ అరెస్ట్ ఖాయమనే సంకేతాలు పంపించారు.
ఇప్పుడు బ్లూ మీడియా కూడా జగన్ అరెస్ట్ ఖాయమనే వార్తలు ప్రచురిస్తుంది. జగన్ ను సాదాసీదాగా, హడావిడిగా అరెస్ట్ చెయ్యకుండా అన్ని ఆధారాలతో అరెస్ట్ చేసి జగన్ తప్పుని ఎత్తి చూపించాలని, ఏపీ ప్రజలకు ఓ అవినీతి ముఖ్యమంత్రి గురించి బాహాటంగా తెలియజెప్పేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతుంది, ఎప్పుడైనా జగన్ అరెస్ట్ ఉండొచ్చని బ్లూ మీడియా చెబుతుంది.
ఢిల్లీలో కేవలం వందల కోట్ల స్కామ్ కే అరెస్ట్ లు జరిగితే ఏపీలో వేల కోట్లు స్కామ్ చేసారు వైసీపీ ముఖ్యనేతలు, మరి ఎలా వదులుతారని బ్లూ మీడియానే మొహమాటం లేకుండా జగన్ అరెస్ట్ పై వార్తలు రాస్తుంది అంటే జగన్ అరెస్ట్ ఖాయమని అందరికి అర్ధమవుతుంది