40 ప్లస్ ఏజ్ లోను అందంతో మరింత ద్విగుణీకృతం అవుతూ కనిపించడం త్రిషకే సొంతమేమో. పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రమోషన్స్ లో అందరి చూపు తనపై ఉండేలా స్టైలిష్ గా, శారీస్ వేసుకుని కనిపించిన త్రిష కి ఆ సినిమా వరసగా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. అందానికి అందం, అవకాశాలకు అవకాశాలతో త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడు పెంచింది.
ఇప్పుడు థగ్ లైఫ్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ తో థగ్ లైఫ్ చిత్రంలో ఘాటు రొమాన్స్ చేసిన త్రిష ఆ చిత్ర ప్రమోషన్స్ లోను స్పెషల్ గా రెడీ అయ్యి క్రేజీగా కవ్విస్తూ ఎవ్వరి చూపు తిప్పుకోనివ్వడం లేదు, ఆమె అందానికి అభిమానులు ఫిదా అవడం చూస్తున్నాం.
తాజాగా బ్లాక్ డ్రెస్ లో త్రిష అందాలను ఏమని వర్ణించగలం అన్నట్టుగా ఆమె లుక్ ఉంది. బ్లాక్ డ్రెస్ లో కర్లీ హెయిర్ తో త్రిష గ్లామర్ గా చాలా స్లిమ్ గా కనిపించింది. 40 ప్లస్ లోను ఇంతందం త్రిషకు సొంతమనేలా ఉందా లుక్. మీరు కూడా త్రిష లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్ వెయ్యండి.