కేన్స్2025 ఫిలింఫెస్టివల్ చాలా వింతలు, వినోదాలకు వేదికగా మారింది. ఈసారి ఫెస్టివల్‌లో నటి రుచి గుజ్జర్ ప్రయోగాత్మక వేషధారణ అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీని రెడ్ కార్పెట్‌పై చూపించే కస్టమ్-మేడ్ నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. రూప శర్మ రూపొందించిన విలాసవంతమైన భారీ డిజైనర్ గోల్డెన్ లెహంగాలో తన సాంస్కృతిక వారసత్వాన్ని ఆవిష్కరించడం ఆసక్తికరం. జరిబారికి చెందిన రామ్ అనే ప్రతిభావంతుడు చేతితో తయారు చేసిన బంధాని దుప్పట్టను ఈ నటి తలపై ధరించింది. జర్డోజీ - గోటా పట్టి తో రూపొందించిన ఈ దుప్పట్టా రాజస్థాన్ వస్త్ర వారసత్వానికి ఆత్మీయ నివాళి.
నెక్లెస్ గురించి నటి రుచి కొన్ని వివరాలను చెప్పారు. ఈ నెక్లెస్ ఆభరణాలను మించినది.. ప్రపంచ వేదికపై భారతదేశం పెరుగుదలకు చిహ్నం. దీనిని కేన్స్‌లో ధరించడానికి కారణం.. భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన మన ప్రధానమంత్రిని నేను గౌరవించాలనుకున్నాను`` అని తెలిపింది. రుచి గజ్జగర్ సైనిక కుటుంబానికి చెందిన యువతి.
నటనలో కొనసాగేందుకు ముంబైకి వచ్చింది. ఈ బ్యూటీ జబ్ తు మేరీ నా రహి, హెలి మే చోర్ మరియు అమన్ వర్మతో కలిసి ఏక్ లడ్కీ వంటి మ్యూజిక్ వీడియోలతో పాపులరైంది. పెద్ద తెరపై రాణించాలని పెద్ద కలలు కంటున్న నటి రుచీ.