నటి పూనమ్ కౌర్ కి జగన్ అనుకూల మీడియా అయిన బ్లూ మీడియా సలహాలు ఇస్తుంది. ఈమధ్యన ఏపీ ముఖ్యమంత్రితో కలిసి ఫోటోలు దిగిన పూనమ్ కౌర్ మరోసారి గురూజీ త్రివిక్రమ్ పై వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. గతంలో గురూజీ పై ఇండైరెక్ట్ గా ట్వీట్లు వేసిన పూనమ్ కౌర్ కొన్నాళ్లుగా డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తుంది. త్రివిక్రమ్ పై మా అసోసియేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.
అయితే మా అధ్యక్షుడు ఆ కంప్లైంట్ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు, టీవీ యాంకర్ ఝాన్సీని కలిసి అడిగితే కొద్దిగా బిజీగా ఉండడం వలన సమావేశానికి ఏర్పాట్లు చెయ్యలేకపోయాము, అంతవరకు కాస్త ఓపిక పట్టమని చెప్పారు అంటూ పూనమ్ కౌర్ త్రివిక్రమ్ విషయంలో ఫిర్యాదు చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యడం చూసిన బ్లూ మీడియా అయ్యో మీరు ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి సంబందించిన మా అసోసియేషన్ ఫిర్యాదు చేస్తే ఏం లాభం, మీరు వెళ్లి ఏపీలో ఫిర్యాదు చేస్తే తక్షణమే న్యాయం జరుగుతుంది.
అక్కడ మహిళల శ్రేయాస్సు కోసమే పనిచేసే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని, నటి జేత్వాని ఫిర్యాదు చెయ్యగానే ఐపీఎస్ లు అని కూడా చూడకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరో ఇద్దరు ఆఫీసర్స్ ని సస్పెండ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. అలాంటి ప్రభుత్వానికి ఫిర్యాదు చెయ్యకుండా ఇక్కడ చేస్తే లాభముండదు అంటూ వెటకారంగా పూనమ్ కౌర్ కి బ్లూ మీడియా సలహాలు ఇస్తుంది.
మరి నటి జేత్వాని కేసులో కూటమి ప్రభత్వం తప్పు చేస్తుంది అని ఇండైరెక్ట్ గా బ్లూ మీడియా చెప్పినట్టేగా, అందుకే పూనమ్ కౌర్ కి వెధవ సలహాలు ఇస్తుంది అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.