కోలీవుడ్ స్టార్ జంట జయం రవి-ఆర్తి విడాకుల కేసు చెన్నై కోర్టులో విచారణలో ఉంది. గత ఏడాది భార్య ఆర్తి తో విడిపోతున్నట్టుగా జయం రవి ప్రకటించారు. కానీ ఆర్తి జయం రవి నుంచి విడిపోయేందుకు ఆసక్తి చూపలేదు, తనని సంప్రదించకుండానే, పిల్లలని పట్టించుకోకుండా విడాకులు అనౌన్స్ చేయడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
ఇక జయం రవి సానుభూతి కోసం పిల్లలని అడ్డుపెట్టుకుంది ఆర్తి.. తాను వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ధైర్యం చేసి విడాకులకు సిద్దమయ్యాను, పిల్లల కోసమే తాను ఓర్చుకున్నాను అంటూ ఆయన వెర్షన్ ఆయన చెప్పారు. డబ్బు, అప్పులు, ఆర్ధిక లావాదేవీలు, దేని వల్లా కాదు, మూడో వ్యక్తి(సింగర్ కేనీషా) వల్లే తాము విడిపోతున్నామంటూ ఆర్తి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తనకి న్యాయం జరిగేవరకు పోరాడుతాను అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేసింది.
తాజాగా విచారణకొచ్చిన జయం రవి-ఆర్తి విడాకుల విషయంలో ఆర్తి తనకు జయం రవి నుంచి నెలకు 40 లక్షల భరణం కావాలని పిటిషన్ వెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 12 కి వాయిదా వేసింది కోర్టు. అయితే ఆర్తి నెలకు 40 లక్షల భరణం అంటే ఏడాదికి 4.8 కోట్లు భరణం అడుగుతుంది. దీనికి జయం రవి ఒప్పుకుంటాడా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.