Advertisement
Google Ads BL

మోహన్ లాల్ బర్త్ డే: కన్నప్ప నుంచి స్పెషల్ గిఫ్ట్


ఈ ఏడాది L 2 ఎంపురాన్, తుడరుమ్ చిత్రాలతో మళయాళంలోనే కాదు పాన్ ఇండియా లోను భారీ హిట్స్ కొట్టిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్ డే నేడు. మే 21 న బర్త్ డే జరుపుకుంటున్న మోహన్ లాల్ కు ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి సర్ప్రైజ్ లు ఇచ్చి ఆయన అభిమాలకు ట్రీట్స్ ఇస్తున్నారు మేకర్స్. 

Advertisement
CJ Advs

మోహన్ లాల్ టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో భాగమయిన విషయం తెలిసిందే. ఈరోజు మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా కన్నప్ప నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి అందరినీ ఆకట్టుకునే అప్డేట్‌ను వదిలారు.

కన్నప్ప వీడియోలో మోహన్ లాల్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, కనిపించిన తీరు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మోహన్ లాల్ ఈ చిత్రంతో మళ్లీ ఆడియెన్స్‌పై తన ముద్రను వేసేలా కనిపిస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించేలా, మోహన్‌లాల్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. 

కన్నప్ప లో దైవిక శక్తితో ముడిపడి ఉన్న కిరాత అనే పాత్రను మోహన్‌లాల్ పోషించారు. కిరాత పాత్రలో మోహన్‌లాల్ ప్రెజెన్స్, యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం విష్ణు మంచు, కన్నప్ప టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. 

Mohanlal Birthday Special Glimpse From Kannappa:

Mohanlal Birthday Special Glimpse From Kannappa Generates Curiosity
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs