రామ్ చరణ్ కి రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ మరోసారి రామ్ చరణ్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారు. సుకుమార్-రామ్ చరణ్ కలయికలో RC 17 పై అనౌన్సమెంట్ కూడా ఇచ్చారు. అటు పుష్ప తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన సుకుమార్, ఇటు ఆర్.ఆర్.ఆర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో వీరి కలయికలో రాబోయే ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలు స్టార్ట్ అయ్యాయి.
అయితే సుకుమార్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత చాలా కామ్ గా ఉన్నారు, అటు చరణ్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తో పెద్ది చిత్ర షూటింగ్ లో ఉన్నాడు, ఈలోపు సుకుమార్ మరో హీరోతో సినిమా చేస్తారు, చరణ్ తో RC17 ఉండకపోవచ్చనే ఊహాగానాలు నడిచాయి. కానీ తాజాగా సుకుమార్ RC 17 పై వస్తోన్న రూమర్స్ కి చెక్ పెట్టారు.
సుకుమార్ తన స్వగ్రామమైన మట్టపర్రు కి వెళ్లారు. అక్కడ సరదాగా మీడియాతో ముచ్చటించిన సందర్భంలో తన తదుపరి మూవీ రామ్ చరణ్ తోనే ఉంటుంది అని స్పష్టం చేసారు. ప్రస్తుతం RC 17 ప్రీ ప్రొడక్షన్ వర్క్, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, పుష్ప చిత్రం తనకి బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది, ఇక తానెప్పుడూ సంక్రాంతికి తన ఊరు వస్తానని, కానీ పుష్ప పనులతో గత మూడేళ్ళుగా తన సొంతూరు రాలేకపోయానని, నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా సంక్రాంతికి తన సొంతూరు వస్తానంటూ ఆయన తన తదుపరి మూవీ RC 17 అని తేల్చేసారు.