నార్త్ లో సక్సెస్ అయిన బిగ్ బాస్ సౌత్ లాంగ్వేజెస్ లో మొదటి సీజన్స్ పర్వాలేదనిపించినా ఆ తర్వాత సీజన్స్ నుంచి బోలెడంత నెగిటివిటి మూటగట్టుకుంటున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా ప్రతి భాషలోను బిగ్ బాస్ పై ఆడియన్స్ లోను అలాగే కంటెస్టెంట్స్ లోను క్రేజ్ పోయింది, దాని స్థానంలో నెగిటివిటి మొదలైంది.
తెలుగులో గత నాలుగైదు సీజన్స్ నుంచి అటు నాగార్జునపై కంటెస్టెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టడమే కాదు, ఓపెన్ గానే నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా పనికి రారనే మాట మాట్లాడుతున్నారు. సీజన్ 7 లో గీతూ రాయల్ నాగార్జున కావాలనే తనని ఎలిమినేట్ చేసారు, నాగార్జున బిగ్ బాస్ చూడరు స్క్రిప్ట్ చదువుతారని బహిరంగంగా కామెంట్స్ చేసింది.
ఇక సీజన్ 8 అంటే గత సీజన్ లో నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల నాగార్జున హోస్ట్ గా పనికిరారు, ఆయనకు బిగ్ బాస్ లోపల ఉన్నవాళ్లు ఏం మాట్లాడుతున్నారో వినబడదు, పట్టించుకోరు, ఆయన హోస్ట్ కాకుండా ఉంటే బావుంటుంది అంటూ కామెంట్స్ చేసింది. ఈలోపు సీజన్ 9 కి బాలయ్య హోస్ట్ అవ్వబోతున్నారనే వార్త వైరల్ అయ్యింది.
అయితే నాగార్జున పై ఎంత నెగిటివిటి వచ్చినా, కంటెస్టెంట్స్ ఏం మట్లాడినా నాగార్జున మాత్రం హోస్ట్ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేరు, ఆయనే బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ గా రాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అగ్రిమెంట్స్ పూర్తయ్యాయని అంటున్నారు. సో నాగార్జున బిగ్ బాస్ విషయంలో తనపై వచ్చే నెగిటివిటీని అస్సలు పట్టించుకోరన్నమాట.