Advertisement
Google Ads BL

భైరవం కి బెదిరింపులు


బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలయికలో విజయ్ కనకమేడల తెరకెక్కించిన భైరవం చిత్రం మే 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే భైరవం చిత్రాన్ని ఆడనివ్వమంటూ ఇప్పుడు వైస్సార్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు బెదిరింపులు స్టార్ట్ చేసారు. కారణం విజయ్ కనకమేడల భైరవం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వైసీపీ పార్టీ వాళ్ళను ఏదో అనేసాడనే విషయంలో వారు #BoyCottBhairavam హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

దర్శకుడు విజయ్ కనకమేడల ఆ ఈవెంట్ లో మట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, సరిగ్గా ఏడాది క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడ్డం కోసం ఒకరొచ్చారంటూ.. ఎక్కడా వైసీపీ పేరు కానీ, ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు కానీ ఎత్తకపోయినా.. అదేదో తమని ఉద్దేశించే అన్నారని వైస్సార్సీపీ పార్టీ వాళ్ళు రెచ్చిపోయి భైరవం చిత్రానికి చుక్కలు చూపిస్తామంటున్నారు. 

సోషల్ మీడియాలో.. 

హలో @HeroManoj1 గారు మోహన్ బాబు గారి అబ్బాయిగా,  భూమా శోభ నాగిరెడ్డి గారి ఇంటి అల్లుడు గా మేము ఎప్పుడు మిమల్ని గౌరవిస్తాం, అభిమానిస్తాం. కానీ  మేము అన్నిటికంటే ఎక్కువగా అభిమానించే మా @YSRCParty గురుంచి కానీ, మా @ysjagan అన్న గురుంచి మీ స్వార్థం కొసం, మీ స్వార్ధ ప్రయోజనం లు కొసం  సినిమా ఈవెంట్ లో రాజకీయం మాట్లాడితే మీరు మాకు రాజకీయ విరోధిగా కనపడతారు.  

బాలకృష్ణ గారు ఎప్పటి నుండో సినిమాలు చేస్తున్నారు కానీ సినిమా ఈవెంట్ ని రాజకీయాన్నీ కలపలేదు.  అందుకే బాలయ్య  సినిమాలు అందరూ చూస్తారు. అసలు మీకు ఎందుకు మరి ?  సినిమా ఈవెంట్ లో మీ కష్టాలు చెప్పుకోండి, మీ టెక్నీషియన్ కష్టాలు చెప్పుకోండి. సినిమా ఏమి గొప్పతనం ఉందో చెప్పుకోండి. అందుకు ఈ ఈవెంట్స్, రాజకీయ సభ పెట్టాలి అనుకుంటే సినిమా అని అడ్డు ఎందుకు?  

నేను మోహన్ బాబు గారి అబ్బాయి గా మీరు ప్రస్తుత రోజుల్లో పడుతున్న కష్టం చూసి సినిమా కి రిలీజ్ రోజు పోదాం అనుకున్నా. కానీ ఇప్పుడు పోను.  మీ టాలీవుడ్ కి ఏది కావలి అంటే అది ఇస్తాం.. అంటూ మనోజ్ ని బెదిరిస్తున్నారు. 

ఇక బ్లూ మీడియా అయితే విజయ్ కనకమేడల వలన భైరవం సినిమా చచ్చిపోతుంది, తన వల్ల ముగ్గురు హీరోల బ్రతుకు నాశనం అవుతుంది, లైలా ఈవెంట్ లో ఏం జరిగిందో చూసారుగా, విశ్వక్ సేన్ దాదాపుగా వైసీపీ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నంత పని చేసాడు, ఇప్పుడు విజయ్ కనకమేడల వలన భైరవం కూడా నష్టపోతోంది అంటూ కథలు వండి వారుస్తుంది. చూద్దాం భైరవానికి ఇదేమంత ఎఫెక్ట్ అవుతుందో అనేది. 

Boycott Bhairavam hashtag trends on X:

Bhairavam Director Faces Heat from YSRCP!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs