బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో నటిస్తూనే కరోనా సమయంలో టాలీవుడ్ దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో హిందీలోకి ఛత్రపతి రీమేక్ తో లాంచ్ అయ్యాడు. తెలుగులో రాజమౌళి-ప్రభాస్ కలయికలో వచ్చిన కల్ట్ మూవీ ఛత్రపతి. ప్రభాస్ ని మాస్ హీరోగా నిలబెట్టిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ హిందీ లో రీమేక్ చేసాడు.
కారణం బెల్లకొండ యాక్షన్ చిత్రాలకు హిందీ యూట్యూబ్ లో బాగా గిరాకీ ఉండడంతో.. బెల్లంకొండ శ్రీనివాస్ ధైర్యం చేసి హిందీలోకి చత్రపతి రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. తాజాగా ఛత్రపతి రీమేక్ చెయ్యకుండా ఉండాల్సింది అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
నటుడిగా ముంబై లోనే శిక్షణ తీసుకున్నాను, నటుడినయ్యాక హిందీలో సినిమా చేసే ఆఫర్ ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చింది. వాళ్ళు మూడు సినిమాల ఆఫర్స్ ఇచ్చినా నేను పట్టించుకోలేదు, కానీ నాన్న చెబితే 2019 లో ఛత్రపతి రీమేక్ కోసం సైన్ చేశాను. మా జనరేషన్ లో ఉన్నవారు రానా, రామ్ చరణ్ హిందీలో నటించారు. చరణ్ జంజీర్ రీమేక్ చేసాడు అది హిందీ సినిమా రీమేక్ అవడంతో వర్కౌట్ అవలేదు, నేను తెలుగు ఛత్రపతికి రీమేక్ చేస్తున్నాగా హిట్ అవుతుంది అనుకున్నా.
ఛత్రపతి హిందీలో ఆడుతుంది, అందులోను రాజమౌళి సినిమాలు 100 పర్సెంట్ వర్కౌట్ అవుతాయని నిర్మాత చెప్పడం తో ఆ సినిమా చేశాను. ఒకొనొక సమయంలో వర్కౌట్ అవ్వదేమో అని నేను అనుకున్నాను, అసలు ఆ రీమేక్ చెయ్యకుండా ఉండాల్సింది అంటూ హిందీ ఛత్రపతి రీమేక్ పై బెల్లకొండ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.