Advertisement
Google Ads BL

వంశీ ఇష్యు ఓకె - నాని విషయంలోనే అన్ హ్యాపీ


వల్లభనేని వంశీ విషయంలో హ్యాపీ గా ఉన్న టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కొడాలి నాని విషయం లో మాత్రం అన్ హ్యాపీ గా వున్నారు. కారణం వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికార మదంతో నోటికొచ్చినట్టుగా మాట్లాడి, చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ, కొడాలి నాని లపై టీడీపీ కార్యకర్తలు గరం గరంగా ఉన్నారు. 

Advertisement
CJ Advs

వంశీ ని, నాని ని ఎప్పుడెప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా అని ఎదురు చూడడమే కాదు, లోకేష్ ని వాళ్లపై యాక్షన్ తీసుకోమంటూ ప్రెజర్ ఎక్కువైంది. ఈలోపు టీడీపీ ఆఫీస్ ఎంప్లొయ్ ని కిడ్నాప్ చేసిన ఈకేసులో వల్లభనేని వంశీ అడ్డంగా బుక్ అయ్యి, అరెస్ట్ అయ్యి  జైలుకెళ్లడమే కాదు, ఈలోపు పలు కేసులు వంశీ మెడకు చుట్టుకున్నాయి. 

నా ఆరోగ్యం బాలేదు, నన్ను విడుదల చెయ్యమని కోర్టుని కోరుతూ బెయిల్ కి అప్లై చేసినా వంశీ కి బెయిల్ రాలేదు, ఒకదానిలో బెయిల్ వస్తే మరొకదానిలో రిమాండ్ అంటూ వంశీ జైల్లోనే ఉంటున్నాడు. 

మరోపక్క అనారోగ్య కారణాలంటూ కొడాలి నాని హైదరాబాద్, ముంబై ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటూ ఇప్పుడు అమెరికా ప్రయాణం పెట్టుకున్నాడనే వార్త వైరల్ అవడంతో టీడీపీ అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే నాని అమెరికా పారిపోతున్నాడు, ముందు నాని ని ఆపండి అంటూ లోకేష్ కి రిక్వెస్ట్ లు పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు . 

ఇక వంశీ జైలుకి కోర్టుకి తిరుగుతున్న వీడియోస్ చూసి కర్మ ఎవ్వరిని వదలడంటూ కామెంట్స్ చేస్తున్నారు. వంశీ విషయంలో టీడీపీ కార్యకర్తలు హ్యపీనే, కానీ నాని విషయంలోనే అన్ హ్యాపీ గా కనిపిస్తున్నారు. 

Happy with Vamsi - Unhappy with Nani:

Happy with Vallabhaneni Vamsi - Unhappy with Kodali Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs