బుట్ట బొమ్మ పూజ హెగ్డే కి టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. గత కొన్నేళ్లుగా ప్లాప్ లు వెంటాడుతున్నా పూజ హెగ్డే లేటెస్ట్ చిత్రం రెట్రో కమ్ బ్యాక్ మూవీ అవుతుంది అనుకుంటే.. సూర్య రెట్రో కూడా బుట్టబొమ్మకు బిగ్ షాక్ ఇచ్చింది. రెట్రో గనక హిట్ అయితే కొన్నాళ్లపాటు పూజ హెగ్డే హవా నడిచేది. కానీ రెట్రో ఈ భామను మరోసారి నిరాశలోకి నెట్టింది.
ఇక రెట్రో లో వింటేజ్ పూజ హెగ్డే గా కనబడడమే కాదు రెట్రో చిత్ర ప్రమోషన్స్ లోను శారీస్ తో అద్దరగొట్టింది. బుట్టబొమ్మ మాదిరి పూజ హెగ్డే శారీ లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు. తాజాగా పూజ హెగ్డే మరోసారి శారీ లుక్ పోస్ట్ చేసింది.
పట్టు టిష్యు శారీ లో పూజ హెగ్డే నిజంగా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఆమె అభిమానులే కాదు నెటిజెన్స్ కూడా పూజ హెగ్డే న్యూ లుక్ చూసి బుట్టబొమ్మ బ్యూటిఫుల్ ఫోటో సెషన్ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.