నటి అనసూయ భరద్వాజ్ రీసెంట్ గా గృహప్రవేశం చేసిన పిక్స్ తో పాటుగా తన కొత్తింటికి శ్రీరామ్ సంజీవిని అని పెట్టుకున్నట్టుగా అభిమానులకి షేర్ చెప్పింది. భర్త భరద్వాజ్, పిల్లలతో కలిసి అనసూయ తన కొత్తింటి లో దిగిన ఫొటోస్ వైరల్ అవ్వగా తాజాగా అనసూయ మరో పోస్ట్ పెట్టింది. తమ ఇంటికి హనుమంతుడు వచ్చినట్టుగా అనసూయ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఇన్స్టా లో నేను పెట్టిన ఫోటో వెనుక అర్ధాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను, ఈ నెల 3 న మేము మా కొత్తింట్లోకి గృహ ప్రవేశం చేసి, హోమాలు, సత్యన్నారాయణ స్వామి వ్రతం, మరకతలింగ రుద్రాభిషేకము, పూజలు చేసాము. టైమ్ లేకపోవడంతో ముందుగా మా గురువుగారిని కలిసి మా ఇంటికి సంజీవిని అని పేరు పెట్టాలని అనుకుంటున్నట్టుగా చెప్పాం, కానీ ఆయన కొద్దిగా అలోచించి శ్రీరామ సంజీవిని అని పెట్టమని చెప్పారు, నేను మా ఆయన కూడా చాలా సంతోషించాము.
ఆ తర్వాత వాస్తుపురుషుడు ఆయన భార్య మేము పూజ చెయ్యడానికి అటు పక్కాగా వెళ్ళాము, మా గురువుగారు హోమం నిర్వహిస్తున్నారు. ఆతర్వాత ఆయన మా దగ్గరికి వచ్చి ఫోన్ చూపిస్తూ హనుమంతుడు వచ్చాడని చెప్పారు. నాకు ఊహ వచ్చాక మా నాన్నగారు నేర్పిన లెసన్ ఒకటుంది, నేను దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, భయాపడినా, మారేదన్నా కానివ్వండి ముందుగా జై హనుమాన్ అని తలవడం అలవాటు, నా కన్న తండ్రి తర్వాత అన్ని నాకు ఆ హనుమంతుడే. అందుకే నా పెద్దకొడుక్కి శౌర్య అని పేరు పెట్టుకున్నాము.
అందుకే ఆ హనుమంతుడు ఈరోజు మా ఇంటికి వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని ఆశీర్వదించాడు, అందరూ నమ్మాలని లేదు, కానీ నాకు ఎదురైన సాక్షత్కారాన్ని మీకు చూపించాలనుకున్నాను, అది కొందరు నమ్మినా చాలు అంటూ అనసూయ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.