వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయిన వారంతా కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కరిగా జైలు బాట పట్టడమే కాదు, ఆయా కేసుల్లో బెయిల్ తెచ్చుకోవడానికి నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ కూడా రీసెంట్ గా పలు కేసుల్లో జైలుకు వెళ్లి ప్రస్తుతం బెయిల్ పై బయటికొచ్చాడు.
కానీ అంతలోనే తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ ని అరెస్ట్ చేసారు. కారణమేమిటంటే రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం నందిగం సురేష్ ఉంటున్న ఇంటి వీధిలో శనివారం రాత్రి టీడీపీకి చెందిన ఇసుకపల్లి రాజు అనే కార్యకర్త తన కారుతో వేగంగా వెళ్లడంతో, సురేష్ అనుచరులు రెచ్చిపోయి రాజు కారును ఆపెయ్యడమే కాకుండా రాజు పై దాడి చేస్తూ రాజును సురేష్ వద్దకు ఈడ్చుకెళ్లారట.
అది విన్న నందిగం సురేష్ ఆయన సోదరుడు రాజు పై దాడి చెయ్యగా, ఎలాగోలా తప్పించుకున్న రాజు ఇంటికి చేరి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆదివారం నందిగం సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. సురేష్ ని అరెస్ట్ చేసిన అంతరం తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద రాజు భార్యను చూసిన సురేష్ ఆయన భార్య తమపై తప్పుడు కేసులు పెట్టారంటూ వారిపైకి దాడికి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.
మరి ఈ చిన్న కేసులో నందిగం సురేష్ రిమాండ్ కు వెళ్తాడా లేదంటే బెయిల్ పై బయటికొస్తాడా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.