యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ ప్రమోషన్స్ లో ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్ డమ్ జులై 4 న పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతుంది. దానితో విజయ్ దేవరకొండ నేషనల్ మీడియాలో సినిమా పై అంచనాలు పెంచుతూ ఇంటర్వూస్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పూరి జగన్నాథ్ తో చేసిన లైగర్ చిత్రం తర్వాత తను చాలా మారాను అని, లైగర్ డిజప్పాయింట్ చేసింది, ఆ చిత్రంతో హిట్ కొట్టాలని, పాన్ ఇండియాలో బెస్ట్ ఫిలిం గా నిలవాలని చాలా కష్టపడ్డాము, కానీ లైగర్ మా ఆశలపై నీళ్లు చల్లింది, పూరి గారితో నా బాండింగ్ చాలా బావుంది, ఆయన తో మరో సినిమా కచ్చితంగా ఉంటుంది అంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్ చేసారు.
లైగర్ చిత్రం హిట్ అయ్యి ఉంటే విజయ్ దేవరకొండ పూరి తో జన గణ మన చేసేవారు. ఆ సినిమా షూటింగ్ మొదలై ఆగిపోయింది. లైగర్ ప్లాప్ వలన జన గణ మన ని ఆపేసారు అనే విషయం తెలిసిందే.
ఇక నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్ తో మంచి ర్యాపొ ఉందని, వారి సినిమాల హిట్ ను తను కూడా సెలెబ్రేట్ చేసుకుంటాను అని చెప్పిన విజయ్ దేవరకొండ నాగ్ అశ్విన్ కి తనంటే సెంటిమెంట్ అని, అందుకే అన్ని సినిమాల్లో తనని పెట్టుకుంటాడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.