వైఎస్సార్ పార్టీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్యెల్యే కొడాలి నాని ప్రస్తుతం గుండెకు సంబంధిత చికిత్స తర్వాత ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. క్రిటికల్ కండిషన్ లో హైదేరాబాద్ నుంచి ముంబై కి ఎయిర్ అంబులెన్సు లో తరలించగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ప్రస్తుతం నాని హైదరాబాద్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారని, తనకు సంబందించిన ఏ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. తనకు అత్యంత సన్నిహితులైన కొద్దిమందిని తప్ప, ఇతరులెవరినీ కలవడం లేదని సమాచారం. తాజాగా నాని మరింత మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరోపక్క కొడాలి నాని ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు, అభిమానులు ఆరా తీస్తున్నారు. అసలు నాని కి ఏమైంది, ఎందుకు అమెరికాకు వెళ్లాలి అనుకుంటున్నారు, ఇకపై రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండరా అని ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు.