కొన్నేళ్లుగా సాగుతున్న హరి హర వీరమల్లు షూటింగ్ ని పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పూర్తి చేసారు, దానితో పాటుగా సుజిత్-దానయ్య ల OG చిత్రాన్నికూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. రీసెంట్ గానే OG సెట్ లో పవన్ అడుగుపెట్టారు. అయితే వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అవడంతో మేకర్స్ జూన్ 12 న విడుదల అని డేట్ అనౌన్స్ చేసారు.
కానీ OG షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడంతో మేకర్స్ రిలీజ్ తేదీ విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. అయితే సెప్టెంబర్ లో అంటే దసరా సీజన్ లో OG ని విడుదల చెయ్యాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. అందుకు మార్గం సుగమమం అవ్వాలంటే OG ముంబై షెడ్యూల్ పూర్తి అవ్వాలట.
OG కి సంబందించిన ముంబై షెడ్యూల్ పూర్తి కాగానే రిలీజ్ డేట్ లాక్ చేస్తారని తెలుస్తుంది. వచ్చే వారం మంత్రివర్గ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ముంబై బయలుదేరి వెళతారని సమాచారం. సో త్వరలోనే OG డేట్ కూడా లాక్ అవ్వబోతుంది, పవన్ ఫ్యాన్స్ కి ఒకే ఏడాది రెండు పండగలన్నమాట.