టాలీవుడ్ లో దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య-అశ్విన్ ల నడుమ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా బేబీ చిత్రం తెరకెక్కగా.. అది యూత్ కి బాగా కనెక్ట్ అవడంతో మేకర్స్ కి భారీగా లాభాలొచ్చాయి.
దానితో సాయి రాజేష్ కి హిందీలో బేబీ రీమేక్ చేసే అవకాశం వచ్చింది. నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ హీరోగా బేబీ రీమేక్ హిందీలో స్టార్ట్ అయ్యింది. అనూహ్యంగా ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్టుగా బాబిల్ ఖాన్ ప్రకటించడం ఒకింత షాకిచ్చింది. ఊహించని కారణాలు చేత సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది, దర్శకుడు సాయి రాజేష్ గారితో జర్నీ చాలా బాగుంది. త్వరలోనే మళ్ళీ మేము కలిసి మ్యాజిక్ చేస్తాం అంటూ బాబిల్ ప్రకటించాడు.
కొద్దిరోజుల క్రితమే బాబిల్ ఖాన్ బాలీవుడ్ లో జరిగే పరిస్థితిలు, నెపోటిజం పై సోషల్ మీడియాలో ట్వీట్ చేసి డిలేట్ చెయ్యడం చర్చకు దారితీసింది. ఇప్పుడు బాబిల్ ఖాన్ బేబీ రీమేక్ నుంచి తప్పుకున్నట్లుగా చెప్పాడు, అటు సాయి రాజేష్ కూడా ఇదే తరహాలో రియాక్ట్ అయిన విషయం తెలిసిందే.