Advertisement
Google Ads BL

ఆప్టే సినిమాకు అవార్డుల పండ‌గ‌


కొత్త‌గా పెళ్ల‌యిన అమ్మాయి చాలా ఊహ‌లు క‌ల‌ల్లో జీవిస్తుంది. భ‌ర్త‌పై చాలా అంచ‌నాలు పెట్టుకుంటుంది. కానీ వాట‌న్నిటికీ విరుద్ధంగా జీవించాల్సిన పరిస్థితులు త‌లెత్తుతాయి. పెళ్ల‌యాక ముంబై స్ల‌మ్స్ లో జీవించే ఒక క‌ల‌లు క‌నే అమ్మాయి జీవితం ఆ త‌ర్వాత ఎలా ట‌ర్న్ అయింది? అనే ఇంట్రెస్టింగ్ క‌థాంశంతో రూపొందించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం `సిస్ట‌ర్ మిడ్ నైట్`. 

Advertisement
CJ Advs

ఈ చిత్రానికి కరణ్ కంధారి దర్శకత్వం వహించారు. బాఫ్టా, కేన్స్ స‌హా ప‌లు అంత‌ర్జాతీయ పుర‌స్కారాల‌కు నామినేట్ అయిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే న‌ట‌నా వైవిధ్యం ఎంతో ఆక‌ట్టుకుంటోంది.

ఈ సినిమా ట్రైల‌ర్ ఆద్యంతం .. కొత్త‌గా పెళ్ల‌యిన యువ‌తి జీవితం, భావోద్వేగాల నేప‌థ్యంలో ఎంతో ర‌క్తి క‌ట్టిస్తోంది. రాధిక ఆప్టే స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌, వేష‌ధార‌ణ ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌తిసారీ ఏదో ఒక ప్ర‌యోగానికి సిద్ధంగా ఉండే రాధిక ఆప్టే మ‌రోసారి ఇలాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ప్ర‌స్తుతం సిస్ట‌ర్ మిడ్ నైట్ ట్రైల‌ర్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. డార్క్ కామెడీ నేప‌థ్యంలోని ఈ చిత్రం మే 23న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Radhika Apte award-winning film Sister Midnight:

Radhika Apte on Sister Midnight and Looking Beyond Bollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs