Advertisement
Google Ads BL

జయం రవిపై అత్తగారు సంచలన ఆరోపణలు


జయం రవి 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. భార్య ఆర్తికి విడాకులిచ్చి సింగర్ కెనిషా తో జయం రవి కలిసి ఉంటున్నారు. అయితే జయం రవి తను వైవాహిక జీవితంలో విసిగి వేసరిపోయాను, ధైర్యం చేసి ఆ బంధం నుంచి బయట పడ్డాను అంటూ చెప్పారు. కానీ భార్య ఆర్తి కి మాత్రం రవికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేక మొదటినుంచి ఆమె సంచలన ఆరోపణలు చేస్తుంది. 

Advertisement
CJ Advs

అసలు జయం రవి భార్య ఆర్తి కి విడాకులివ్వడానికి ప్రధాన కారణం ఆర్తి తల్లే అని, ఆమె జయం రవి కెరీర్ ని డిసైడ్ చెయ్యడం, నించోమంటే నించోవాలి, ఆమె చెప్పిందే చెయ్యాలనే ధోరణితో ఉండడంతోనే విసిగిపోయిన జయం రవి భార్యకు విడాకులు ఇచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జయం రవి పై ఆర్తి తల్లి, జయం రవి అత్తగారైన సుజాత విజయ్‌కుమార్‌ తీవ్ర ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 

జయం రవి ప్రవర్తన వల్లే తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, రవి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదని, రవి ప్రోత్సాహం తోనే తను నిర్మాతగా మారి సినిమాలు నిర్మించాను, అల్లుడైనా రవిని కొడుకులా భావించాను, రవి తో అడంగ మరు, భూమి, సైరన్‌ వంటి చిత్రాలను నిర్మించాను, ఆ చిత్రాల కోసం 100 కోట్లు అప్పు చేశాను. అందులో 20 పర్సెంట్ పారితోషికంగా రవికె ఇచ్చాను. 

అప్పుల కారణంగా నేను ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాను. నాకొచ్చిన నష్టాలను పూడ్చడానికి నా బ్యానర్‌లోనే మరో సినిమా చేస్తానని సైరన్‌ సమయంలో రవి మాటిచ్చాడు. కానీ చెయ్యలేదు. అప్పులు తీర్చడానికి సాయం చేస్తానని కూడా చెప్పలేదు, జయం రవి హీరో అయ్యుండి తమపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం బాధగా ఉంది, అతన్ని హీరోగా అనుకోలేమని, తనని అమ్మ అని పిలిచేవాడు, కానీ ఇప్పుడు సానుభూతి కోసం డ్రామా చెయ్యడం బాధగా ఉంది అంటూ జయం రవి అత్తగారు ఎమోషనల్ గా వదిలిన నోట్ వైరల్ అయ్యింది. 

Mother in law slams Jayam Ravi:

Jayam Ravi mother in law furious with the actor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs