గత ఏడాది అంటే 2024 లు ఎన్నికల్లో ఊహించని రీతిలో విజయకేతునం ఎగురవేసి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసాక.. విడతల వారీగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే 4 వేలు పెన్షన్ తో పాటుగా, దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ని మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం మొదలు కాగానే పిల్లల కోసం తల్లికి వందనం పథకం ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు మరో పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉచిత బస్సు సేవల గురించి ప్రకటన చేశారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంటే ఆగస్టు 15 నుండి రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి నెలా మూడో శనివారాన్ని శుభ్రత దినంగా పాటించాలని, ప్రజలు, ఉద్యోగులు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సిమీ చంద్రబాబు పిలుపునిచ్చారు.